Published : 08 Jan 2022 22:03 IST

Corona: కొనసాగుతున్న కొవిడ్‌ విజృంభణ.. దిల్లీలో 20వేలు దాటిన కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. రాజధాని దిల్లీలో విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20,181 మందికి పాజిటివ్‌గా తేలింది. గత మే నెల నుంచి ఇవే అత్యధిక కేసులు. ఏడుగురు మృతిచెందారు. ఈ రోజు 20వేల కేసులు నమోదు కావచ్చు అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఈరోజు ఉదయమే వెల్లడించడం గమనార్హం. శుక్రవారంతో పోలిస్తే (17,335) తాజా కేసుల్లో 19 శాతం పెరుగుదల కనిపించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.60 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,178 యాక్టివ్‌ కేసులున్నాయి. రికవరీ రేటు 95.19 శాతంగా ఉంది.

ముంబయిలో స్వల్పంగా తగ్గిన కేసులు

గడిచిన 24 గంటల్లో ఆర్థిక రాజధాని ముంబయిలో 20,318 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో (20,971) పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. కొవిడ్‌తో శనివారం ఐదుగురు మృతిచెందారు. అయితే వైరస్‌ సోకినవారిలో 82శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. లక్షణాలు ఉన్నవారిలో 1257 మంది ఆసుపత్రుల్లో చేరారు. వారిలో 108 మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ముంబయిలో ప్రస్తుతం లక్షకు పైగానే యాక్టివ్‌ కేసులున్నాయి. 21.4 శాతం పడకలు బాధితులతో నిండిపోయాయి.

కర్ణాటకలో 8,906 మందికి..

కర్ణాటకలో మొత్తం 8,906 కొత్త వైరస్​ కేసులు వెలుగు చూశాయి. 508 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. నలుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 38,366కు చేరింది. 38 వేలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఒక్కరోజే 5,944 కేసులు నిర్ధరణ అయ్యాయి. 2,463 మంది రికవరీ అయ్యారు. మరో 33 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 31,098గా ఉంది. మొత్తంగా 49,547 మంది వైరస్‌​ కారణంగా చనిపోయారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని