Positivity Rate: దిల్లీలో 0.30 శాతానికి

ఒక దశలో 36 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 0.30 శాతానికి దిగివచ్చింది. గడిచిన 3 నెలల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 71,513 పరీక్షలు నిర్వహించగా....

Published : 12 Jun 2021 21:24 IST

దిల్లీ: రోడ్లపై అంబులెన్స్‌ల కూతలు.. ఆసుపత్రుల ముందు బాధితుల క్యూలు.. ఆక్సిజన్‌ అందక మృత్యు కేకలు.. ప్రతిరోజూ వందల సంఖ్యలో మరణాలు.. ఇదీ కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం. లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితులు కుదురుకుంటున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక దశలో 36 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 0.30 శాతానికి దిగివచ్చింది. గడిచిన 3 నెలల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 71,513 పరీక్షలు నిర్వహించగా.. 213 మందికి పాజిటివ్‌గా తేలింది. 28మంది మృతిచెందారు. దిల్లీలో గడిచిన 24 గంటల్లో 497 మంది రికవరీ అయ్యారు.

భారత్‌లో కరోనా మూడో దశ రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దిల్లీ సర్కారు అప్రమత్తమైంది. కరోనా రెండో దశ సమయంలో ఆసుపత్రుల్లో పడకల కొరత, తీవ్రమైన ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంతో వాటిని అధిగమించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు,  ప్రాణవాయువు సదుపాయాలను పెంచుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని