దిల్లీలో ఒక్కరోజే 100కిపైగా మృత్యువాత

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా విజయతాండవం సృష్టిస్తోంది. కొవిడ్‌ విజృంభణ ధాటికి గడిచిన 24 గంటల్లో దిల్లీలో 104 మంది మృత్యుఒడికి చేరారు. మరో 17,282 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు...

Updated : 14 Apr 2021 23:15 IST

 

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కొవిడ్‌ విజృంభణ ధాటికి గడిచిన 24 గంటల్లో అక్కడ 104 మంది మృత్యువాత పడ్డారు. మరో 17,282 మందికి కొత్తగా కరోనా సోకింది. దిల్లీలో ఇప్పటి వరకు 7,67,438 కరోనా బారిన పడగా 11,540 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ క్రియాశీలక కరోనా కేసుల సంఖ్య 50,736గా ఉంది. 

రాజస్థాన్‌లో రాత్రిపూట కర్ఫ్యూ

కరోనా మహమ్మారి ధాటికి  రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా ఆంక్షల వలయంలోకి వెళ్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ కూడా ఈ జాబితాలోకి చేరింది. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచే ఈ తాజా ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. వీటితో పాటే మరిన్ని ఆంక్షలను కూడా రాజస్థాన్‌ కఠినతరం చేసింది. కిరాణా దుకాణాలన్నింటినీ సాయంత్రం 5 గంటల తర్వాత మూసివేయాలని సూచించింది. విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లను పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వివాహాలను కేవలం 50 మందితోనే జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. కాగా, రాజస్థాన్‌లో బుధవారం 6,200 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని