Delhi Corona: పాఠశాలలు నడుస్తాయి కానీ, మాస్క్‌ పెట్టాల్సిందే..!

కరోనా మనల్ని ఇప్పట్లో వదిలేలా లేదు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దిల్లీ పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తోంది.

Published : 20 Apr 2022 16:28 IST

దిల్లీ: కరోనా మనల్ని ఇప్పట్లో వదిలేలా లేదు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దిల్లీ పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తోంది. దాంతో అక్కడి యంత్రాంగం మళ్లీ మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలనుకుంటోంది. మాస్కులు ధరించనివారికి రూ.500 జరిమానా విధించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగిన దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

ప్రస్తుతానికి పాఠశాలు యథావిధిగా నడవనున్నాయి. నిపుణులతో  చర్చించిన మీదట విద్యాసంస్థల్లో అమలు చేయాల్సిన నియమావళిపై మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంపు, టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నగరంలో కరోనా కొత్త కేసులు పెరుగుతోన్న దృష్ట్యా ఈ సమావేశం జరిగింది. నిన్న అక్కడ 632 మందికి కరోనా సోకింది. ముందురోజుతో పోల్చితే.. 26 శాతం పెరుగుదల కనిపించింది. మూడువారాల క్రితమే దిల్లీ జరిమానాను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతలోనే కేసులు పెరగడంతో  మాస్కు తప్పనిసరి చేస్తూ.. రూ.500 జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ ఈ తరహా ఆదేశాలే జారీ చేసింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని