
Delhi: దిల్లీ అల్లర్లలో నిందితుడికి పెరోల్.. స్థానికుల భారీ స్వాగతం
దిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న అల్లర్లలో పోలీసుల పైనే తుపాకి ఎక్కుపెట్టిన ఓ వ్యక్తి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నిందితుడు జైలులో ఉండగా.. తాజాగా పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఈ సమయంలో నిందితుడికి ఇంటివద్ద భారీ స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 2020 ఫిబ్రవరి నెలలో ఈశాన్య దిల్లీలో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మృతిచెందగా వందలమంది గాయపడ్డారు. భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షారుఖ్ పఠాన్ తండ్రి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తండ్రిని చూసేందుకు నిందితుడికి నాలుగు గంటలపాటు పెరోల్ లభించింది. ఈ సమయంలో నిందితుడు నివాసానికి వెళ్లే సమయంలో పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వడంతోపాటు స్థానికుల నుంచి భారీ స్వాగతం లభించింది. చాలా మంది షారుఖ్పఠాన్ను అనుసరించడమే కాకుండా కరచాలనం చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. నాలుగు గంటల పెరోల్ ముగిసిన అనంతరం పఠాన్ తిరిగి జైలుకు వెళ్లాడు. మే 23న ఈ ఘటన చోటుచేసుకోగా ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలాఉంటే, పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా 2020లో దిల్లీలో చెలరేగిన అల్లర్ల సమయంలో షారుఖ్ పఠాన్ పోలీసులపైనే తుపాకి ఎక్కుపెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో నిందితుడిపై అల్లర్లు, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: అండర్సన్ vs కోహ్లీ.. ఇదే చివరి పోరా?
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
-
Politics News
Komatireddy: భూములిచ్చిన రైతులకు బేడీలా? కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
-
Sports News
T20 World Cup: టీమ్ఇండియాకు షాకేనా..? టీ20 ప్రపంచకప్ జట్టులో షమి లేనట్టేనా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్