corona: దిల్లీ పాఠశాలలో కరోనా కలకలం..!

దిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం అధికంగా కరోనా కొత్త కేసులొచ్చాయి. ఆ ప్రభావం ఓ పాఠశాల మీద కూడా పడింది.

Published : 14 Apr 2022 15:33 IST

అంతకుముందు యూపీ పాఠశాలల్లో కూడా..

దిల్లీ: దిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం అధికంగా కరోనా కొత్త కేసులొచ్చాయి. ఆ ప్రభావం ఓ పాఠశాల మీద కూడా పడింది. అక్కడ ఒక టీచర్, విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో విద్యార్థులందరినీ ఇంటికి పంపివేశారు. దీనిపై ఆప్ ఎమ్మెల్యే అతిశి మాట్లాడుతూ.. పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. 

దీనికి ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పాఠశాలలో కొవిడ్ కేసులు వచ్చాయి. అక్కడ 23 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. దాంతో పాఠశాలను మూసివేశారు. మరోపక్క ఘజియాబాద్‌లోని పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు. 2020 మార్చి నుంచి కరోనా కారణంగా విద్యాసంస్థలు సరిగా తెరుచుకోలేదు. ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. కొద్దినెలలుగా పిల్లలు సజావుగా పాఠశాలలకు వెళ్తున్నారు. ఇంతలోనే ఎక్స్‌ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. ఇప్పుడు దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండనుందో తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని