Covid cases: దిల్లీలో మరింత దిగువకు

దేశ రాజధాని దిల్లీని కకావికలం చేసిన రెండో దశ కరోనా తగ్గుముఖం పడుతోంది. కరోనా కేసులు ప్రతిరోజు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,506 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా....

Published : 24 May 2021 21:05 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని కకావికలం చేసిన రెండో దశ కరోనా తగ్గుముఖం పడుతోంది. కరోనా కేసులు ప్రతిరోజు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,506 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 1,550 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దిల్లీలో కరోనా కేసులు 2 వేలకు దిగువన నమోదవడం వరుసగా ఇది రెండో రోజు. మార్చి 27 తర్వాత ఇంత  తక్కువ కేసులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు తాజాగా 2.52 శాతంగా ఉంది. అయితే మరణాలు మాత్రం అధికంగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 207 మంది మృతిచెందారు. 

గడిచిన 24 గంటల్లో 4,375 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 13.7 లక్షల మంది కోలుకున్నట్లయ్యింది. ప్రస్తుతం దిల్లీలో ఉన్న యాక్టివ్‌ కేసులు 24,578 మాత్రమే.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కేజ్రీవాల్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించింది. మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆదివారం పేర్కొంది. ఇదే తరహాలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తే మే 31 నుంచి ఆంక్షలు సడలించే (అన్‌లాక్‌) ప్రక్రియ ప్రారంభిస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని