IndiGo: ‘ఉష్ణోగ్రత’ సెగ.. రెండు గంటలు నిలిచిపోయిన విమానం

అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రెండు గంటలు ఆలస్యం కావడంతో గాలి లేక ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

Updated : 17 Jun 2024 19:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేసవి కాలం ముగిసినా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గటం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో (IndiGo) విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగింది. గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్లితే..

ఇండిగో విమానం 6E 2521 దిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 2.30కు టేకాఫ్‌ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడమే అందుకు కారణమని తెలుస్తోంది. దీంతో ప్లైట్‌ టేకాఫ్‌కు రెండు గంటలు ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. డోర్‌ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. ఏసీ పనిచేయకపోవడంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రూ.5లక్షలు పెట్టి టికెట్‌ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం

ఈ ఘటనపై స్పందించిన ఇండిగో వివరణ ఇచ్చింది. ‘‘బాగ్‌డోగ్రా వెళ్లే విమానంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. గమ్యస్థానానికి చేరుకునేందుకు చర్యలు జరుగుతున్నాయి’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని