Heavy Rain: స్తంభించిన దిల్లీ.. దశాబ్దంలోనే రికార్డు స్థాయి వర్షపాతం!

శనివారం నుంచి దేశ రాజధాని దిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం స్తంభించిపోయింది. గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది.

Updated : 09 Oct 2022 14:02 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సాధారణంగా అక్టోబరులో దిల్లీలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదు. శీతాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో అక్కడ ఏటా గాలి నాణ్యత క్షీణించడం మొదలవుతుంది. శివారు ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం కూడా ఇదే నెల నుంచి ఆరంభిస్తారు. అయితే, తాజాగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల గాలి నాణ్యత కొంత మెరుగవుతుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గత 24 గంటల్లో దిల్లీలో కురిసిన వర్షపాతం రికార్డు నెలకొల్పిందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ ఉపాధ్యక్షుడు మహేశ్‌ పలావట్‌ తెలిపారు. గత దశాబ్దకాలంలో దిల్లీలో అక్టోబరులో ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ కురవలేదన్నారు. శనివారం నుంచి ఇప్పటి వరకు 74 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల మేర పడిపోయాయన్నారు. సోమవారం నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. దిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లోని ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, నోయిడాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని