Delhi: మద్యం హోండెలివరీకి ఇంకాస్త ఆగాల్సిందే!

మొబైల్‌ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా హోం డెలివరీ బుకింగ్స్ చేసుకోవచ్చు

Updated : 12 Jun 2021 11:57 IST

దిల్లీ ప్రభుత్వం సరికొత్త షరతులు ఏంటంటే.. 

దిల్లీ: మందుబాబులకు మద్యం హోండెలివరీ అంటూ దిల్లీ ప్రభుత్వం కిక్కిచ్చే వార్త కొన్ని రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. కేవలం ఫ్యాక్స్‌ లేదా ఈ-మెయిల్‌ ద్వారా బుక్‌ చేసుకుంటేనే డెలివరీ అవుతుందని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. అయితే మద్యానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా.. యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్స్‌కు అనుమతి ఇచ్చింది. తాజాగా దిల్లీ ప్రభుత్వం మద్యం డెలివరీ, సరఫరాకి సంబంధించి కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది.. అవేంటంటే..
* మొబైల్‌ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా హోం డెలివరీ బుకింగ్స్ చేసుకోవచ్చు.
* రెస్టారెంట్లు, పబ్స్‌లో లైవ్‌  పెర్ఫార్మెన్స్‌ నిర్వహించవచ్చు. అక్కడే మద్యం తాగేందుకు సైతం అనుమతి.
* పబ్స్‌, రెస్టారెంట్‌, బార్లు కనుక లైసెన్స్‌ పొందినట్లైతే.. ఓపెన్‌ స్పెస్‌, టెర్రస్‌ ప్రదేశాల్లో మద్యం సేవించవచ్చు.
*టేక్‌అవే పద్ధతిలో మైక్రో బ్రూవరీస్ మద్యాన్ని సరఫరా చేయొచ్చు. అదేవిధంగా రెస్టారెంట్లు, పబ్స్‌, ఈవెంట్లకి మద్యాన్ని అమ్ముకోవచ్చు.

శుక్రవారం నుంచి ఈ షరతులతో మద్యం హోం డెలివరీ అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీలో ఉన్న మద్యం దుకాణాదారులందరూ హోండెలివరీకి అర్హులు కాదు. కేవలం ఎల్‌-13 లైసెన్స్‌లు ఉన్నవారికి మాత్రమే హోండెలివరీ చేయడానికి అనుమతి ఉంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏ దుకాణదారుడికి ఒక్క ఎల్‌-13 లైసెన్స్‌ అందించలేదు. ఎల్‌-13 దరఖాస్తులు వచ్చిన దాన్ని బట్టి దిల్లీలో హోం డెలివరీ ప్రారంభం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని