Corona: వెంటనే మూడోదశ వస్తే.. కష్టమే!
కరోనా వైరస్ రెండో దశలో డెల్టా వేరియంట్ ప్రబలంగా వ్యాప్తి చెందిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. అయితే ప్రస్తుతం కేరళలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని మీడియా సమావేశంలో భాగంగా వెల్లడించారు.
కేరళలో రెండో దశలో డెల్టా వేరియంట్ విస్తృత వ్యాప్తి
తిరువనంతపురం: కరోనా వైరస్ రెండో దశలో డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. అయితే ప్రస్తుతం కేరళలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
‘ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య తగ్గుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు లాక్డౌన్ ఆంక్షలు పనిచేశాయి. మరణాల విషయంలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే.. కేరళ మెరుగైన పనితీరు చూపింది. అయితే పూర్తి స్థాయిలో ఆంక్షల సడలింపునకు పరిస్థితులు అనుకూలంగా లేవు. గత మూడురోజులుగా సగటు పాజిటివిటీరేటు 13.9 శాతంగా నమోదవుతోంది. దాన్ని 10శాతం దిగువకు తీసుకురావడమే లక్ష్యం. ఇంటా బయటా ప్రజలు కచ్చితంగా కొవిడ్ ఆంక్షలను పాటించాలి’ అని విజయన్ సూచించారు. అలాగే రాష్ట్రంలో 6.61శాతం మంది రెండు డోసులు పొందగా.. 25శాతం మందికిపైగా మొదటి డోసును స్వీకరించారని వివరించారు.
ఇప్పటికే కరోనా రెండోదశ తీవ్రరూపం దాల్చగా.. వెంటనే మూడోదశ దాడి చేస్తే పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మరో దఫా వైరస్ విజృంభిస్తే ..భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. లాక్డౌన్ ఆంక్షల తర్వాత ప్రజలు నిబంధనలు పాటించాలి. ఈ సమయంలో మరిన్ని వైద్యసదుపాయాలను సమకూర్చనున్నాం’ అని వివరించారు. అలాగే మూడో దశ పిల్లలపై ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో వ్యాధి నివారణకు విస్తృతమై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేరళలో 24 గంటల వ్యవధిలో 14,233 మందికి కరోనా సోకగా..173 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా 27లక్షల మందికి కరోనా సోకగా..10వేలకు మందికిపైగా బలయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్