Updated : 24 Jun 2021 20:34 IST

Delta: 85 దేశాల్లో గుర్తింపు.. WHO ఆందోళన

జెనీవా: ప్రస్తుత పోకడలు ఇలాగే కొనసాగితే.. వేగంగా ప్రబలే స్వభావమున్న డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. ప్రతివారం విడుదల చేసే నివేదికల్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ హెచ్చరిక జారీ చేసింది. ఈ కరోనా రకాన్ని ఇప్పటికే 85 దేశాల్లో గుర్తించిన నేపథ్యంలో.. ఆందోళన వ్యక్తం చేసింది.  

వేగంగా వ్యాప్తి చెందుతూ, వ్యాధి తీవ్రతను పెంచే గుణమున్న నాలుగు కరోనా వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఆందోళనకర వేరియంట్లు’గా వర్గీకరించింది. అవి..ఆల్ఫా (170 దేశాలు), బీటా (119 దేశాలు), గామా (71 దేశాలు), డెల్టా (85 దేశాలు) వేరియంట్లు ఇప్పటికే పలు దేశాల్లో వ్యాప్తి చెందాయి. ఆల్ఫా వేరియంట్‌ కంటే గణనీయంగా ప్రబలే స్వభావమున్న డెల్టా ఇప్పుడు భౌగోళిక ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. సింగపూర్‌లో జరిపిన అధ్యయనం ప్రకారం.. డెల్టా బాధితుల్లో ఆక్సిజన్ అవసరం పెరగడంతోపాటు, ఐసీయూల్లో చేరిక, మరణంతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఆల్ఫా కంటే డెల్టా వేరియంట్‌కే ఎక్కువ వ్యాపించే లక్షణం ఉన్నట్లు జపాన్‌ అధ్యయనంలో తేలింది. ఈ విషయాలను ఆరోగ్య సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. భారత్‌లో రెండోదశలో కరోనా ఉద్ధృతికి ఈ డెల్టా వేరియంటే కారణమని నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్తకేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని