Dengue: ఒక్క రోజులో 109 డెంగీ కేసులు

కేరళలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే  109 మందికి డెంగీ సోకినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Published : 06 Jul 2024 21:10 IST

తిరువనంతపురం: కేరళలో (Kerala) డెంగీ (Dengue) కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే 109 మందికి డెంగీ సోకినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్‌ సర్వీస్‌(DHS) విడుదల చేసిన వివరాల ప్రకారం.. శుక్రవారం 11,500 మందికి పరీక్షలు నిర్వహించగా.. 109 మందికి డెంగీ నిర్ధరణ అయ్యింది. ముఖ్యంగా మలప్పురం జిల్లాలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జులై 1 నుంచి ఐదు రోజుల వ్యవధిలో దాదాపు 50 వేల మంది జ్వరం బారిన పడినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ మీడియాకు తెలిపారు. డెంగీ నిర్ధరణ అయినవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని