Pregnancy Termination: 26 వారాల గర్భ విచ్ఛిత్తికి బాంబే హైకోర్టు నిరాకరణ

28 ఏళ్ల మహిళ తన 26 వారాల గర్భవిచ్ఛిత్తి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.   

Published : 08 Jul 2024 23:22 IST

ముంబయి: ఓ మహిళ తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి ముంబయి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అందుకు అనుమతి నిరాకరించింది. తనకు ఇప్పటికే నాలుగేళ్ల కుమార్తె ఉందని, తన భర్తతో విడాకుల ప్రక్రియ కొనసాగుతుండడంతో పాటు తన స్నేహితుడితో సహజీవనంలో ఉండగా ఈ గర్భాన్ని దాల్చినట్లు 28 ఏళ్ల ఓ మహిళ ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ ఎ.ఎస్‌.గడ్కరీ, జస్టిస్‌ నీల గోఖలేతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆమె పిటిషిన్‌ను విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులను గురించి ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా పురుషుల సమాంతర బాధ్యతలను నొక్కి చెప్పింది.  
‘ప్రతి మహిళకు గర్భంపై పూర్తి హక్కులు ఉంటాయి. కానీ గర్భ విచ్ఛిత్తికి ఇది సరైన సమయం కాదని మెడికల్‌ బోర్డు(medical board) పేర్కొంది. ఈ దశలో గర్భాన్ని వైద్యపరంగా తొలగించేందుకు మా న్యాయపరమైన మనఃస్సాక్షి అనుమతించదు. బోర్డు ఆదేశాలకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించలేము’ అని స్పష్టం చేసింది. కోర్టు తన మన మహిళ గర్భ విచ్ఛిన్నం చేయాలనుకోవడానికి ఆర్థిక ఇబ్బందులతో పాటు సమాజంలో ఎదురయ్యే కళంకాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ కారణాలు పరిగణలోనికి తీసుకోలేమని స్పష్టం చేసింది. శిశువు జన్మించిన తరువాత పిటిషినర్‌ తన బిడ్డను దత్తతకు ఇవ్వవచ్చని తెలిపింది. ఇటువంటి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. మెడికల్‌ టర్మినేషన్‌ చట్టం ప్రకారం 24 వారాల గర్భాదారణ కాలం దాటిన తరువాత గర్భ విచ్ఛిన్నానికి కోర్టు అనుమతి తప్పనిసరి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని