Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌కు DGCA గ్రీన్‌సిగ్నల్‌

కమర్షియల్‌ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించాలని ప్రయత్నిస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌.....

Published : 20 May 2022 23:59 IST

దిల్లీ: కమర్షియల్‌ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించాలని ప్రయత్నిస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం మంజూరు చేసింది. అలాగే, విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఐదు ప్రూవింగ్‌ ఫ్లైట్లను నడిపింది. ఈ నెల 15, 17 తేదీల్లో విజయవంతంగా నడిపిన తర్వాత తాజాగా  డీజీసీఏ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. దీంతో జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో కమర్షియల్‌ సర్వీసులను పునఃప్రారంభించేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సిద్ధమవుతోంది. 

ఆర్థికంగా కుదేలైన నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు గత మూడేళ్లుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్‌ 17న జెట్‌ ఎయిర్‌వేస్‌ తన చివరి విమానం నడిపింది. గతంలో నరేశ్‌ గోయల్‌ యజమానిగా ఉండగా.. ప్రస్తుతం జలాన్- కర్లాక్‌ కన్సార్షియం ఈ సంస్థకు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు