వ్యాక్సిన్లపై డీజీసీఐ కీలక ప్రకటన రేపే

దేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతిస్తూ డీజీసీఐకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై డీజీసీఐ రేపు కీలక ప్రకటన చేయనుంది.........

Published : 02 Jan 2021 22:50 IST

దిల్లీ: దేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతిస్తూ డీజీసీఐకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై డీజీసీఐ రేపు కీలక ప్రకటన చేయనుంది. ఆదివారం ఉదయం 11గంటలకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ మీడియాతో మాట్లాడనున్నారు.

మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కోసం 75లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించిన కో-విన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వీరంతా దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీకి ముందు చేపట్టిన మాక్‌డ్రిల్‌లో భాగంగా ఈ రోజు ఉదయం 9గంటలనుంచి దేశ వ్యాప్తంగా 125 జిల్లాల్లోని 286 ప్రాంతాల్లో డ్రైరన్‌ నిర్వహించినట్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్‌పై 1,14,100మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపింది. 

ఇవీ చదవండి..

గుడ్‌న్యూస్‌: కొవాగ్జిన్‌కూ గ్రీన్‌ సిగ్నల్‌

దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత టీకా!

దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు