
బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు!
ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడి
దిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణపై భారతీయ రిజర్వు బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆర్బీఐ స్పష్టంచేసింది. ‘పీఎస్బీల ప్రైవేటీకరణపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము. ఆ ప్రక్రియ కొనసాగుతుంది’ అని దిల్లీలో జరిగిన ‘ఇండియా ఎకనామిక్ కాంక్లేవ్ 2021’ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ రంగం కోసం బలమైన మూలధన ఆధారిత, నీతితో కూడిన పాలన నెలకొల్పడమే ఆర్బీఐ విధాన ప్రాధాన్యత అని శక్తికాంత దాస్ పునరుద్ఘాటించారు.
మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులను ప్రైవేటీకరించినా.. ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం తప్పకుండా కాపాడుతుందని ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.