ఇండోనేసియా విమాన ‘బ్లాక్‌బాక్స్‌’లభ్యం..

గత శనివారం ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరి కొద్ది సేపటికే అదృశ్యమైన విమాన ఘటనలో కీలక పురోగతి కనిపించింది. ప్రమాద దర్యాప్తులో కీలకంగా పనిచేసే బ్లాక్‌బాక్సును మంగళవారం సముద్రం నుంచి వెలికితీశారు.

Published : 12 Jan 2021 23:02 IST

జకార్తా: గత శనివారం ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరి కొద్ది సేపటికే అదృశ్యమైన విమాన ఘటనలో కీలక పురోగతి కనిపించింది. ప్రమాద దర్యాప్తులో కీలకంగా పనిచేసే బ్లాక్‌బాక్సును మంగళవారం సముద్రం నుంచి వెలికితీశారు. శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన ఈ బోయింగ్‌ 737-500 విమానంలో సిబ్బందితో సహా 62మంది ఉన్నారు. కాగా ఈ లభ్యమైన బ్లాక్‌బాక్స్‌ కాక్‌పిట్‌లోదా లేక విమాన డేటాకు సంబంధించినదా తెలియాల్సి ఉంది. ఈ బ్లాక్‌బాక్స్‌ను ఈ ఘటనపై విచారణ చేస్తున్న జాతీయ రవాణా భద్రతా కమిటీకి అప్పగించనున్నారు. ఈ విమాన శకలాలను అన్వేషించేందుకు సుమారు 160 మంది డైవర్లు కృషిచేస్తున్నారని ఇండోనేసియా నేవీ చీఫ్‌ యూదో మార్గోనో తెలిపారు. ఇప్పటి వరకూ లభించిన మానవ శరీర భాగాలు, విమాన శకలాలు సుమారు 23 మీటర్ల లోతులో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. సముద్రంలో లభ్యమైన శరీరభాగాలను ప్రయాణీకుల గుర్తింపు కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి..

కరోనా కేసుల్లో భారీ తగ్గుదల

నూతన సాగు చట్టాల అమలుపై స్టే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని