coronavaccine: నెలకు ఎన్ని డోసులు ఉత్పత్తి?
భారత్‌లో నెలకు 8.5 కోట్ల కొవిడ్ టీకా డోసులు ఉత్పత్తి అవుతున్నాయని కేరళ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే రోజుకి సగటున 12-13 లక్షల డోసులు ప్రజలకు అందజేస్తున్నామని వెల్లడించింది. అయితే, ఆయా రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్లను ఎప్పటిలోగా అందజేయాలనే విషయంలో ఎలాంటి నిర్ధిష్టమైన లక్ష్యాలు లేవని స్పష్టం చేసింది.
తిరువనంతపురం: భారత్‌లో నెలకు 8.5 కోట్ల కొవిడ్ టీకా డోసులు ఉత్పత్తి అవుతున్నాయని కేరళ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే రోజుకి సగటున 12-13 లక్షల డోసులు ప్రజలకు అందజేస్తున్నామని వెల్లడించింది. అయితే, ఆయా రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్లను ఎప్పటిలోగా అందజేయాలనే విషయంలో ఎలాంటి నిర్ధిష్టమైన లక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి నెలకు 6.5 కోట్ల డోసులు, భారత్ బయోటెక్ నుంచి 2 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించింది.
దేశంలో అందుబాటులోకి వచ్చిన మూడు టీకాల ఉత్పత్తి రానున్న రెండు నెలల్లో గణనీయంగా పెరగనుందని హైకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం తెలిపింది. ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ తమ తయారీ సామర్థ్యాన్ని నెలకు 5 కోట్ల నుంచి 6.5 కోట్లకు పెంచినట్లు గుర్తుచేసింది. జులై నాటికి దీన్ని మరింత మెరుగుపరచనున్నట్లు పేర్కొంది. ఇక భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకా తయారీని 90 లక్షల నుంచి 2 కోట్ల డోసులకు పెంచినట్లు తెలిపింది. దీన్ని రానున్న కొన్ని నెలల్లో 5 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పింది. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన మూడో టీకా స్పుత్నిక్-వి సామర్థ్యాన్ని 30 లక్షల నుంచి 1.2 కోట్లకు పెంచనున్నట్లు వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ల ధరపై కఠినమైన నియంత్రణలు విధించడం వల్ల సరిపడా టీకాలు అనుకున్న సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిపింది.
అయితే, కేంద్రం తెలిపినట్లుగా నెలకు 8.5 కోట్ల డోసులు ఉత్పత్తి అయితే.. రోజుకి సగటున 28.33 లక్షల డోసులు తయారవుతున్నాయి. కానీ, రోజుకి సగటున 12-13 లక్షల డోసులు మాత్రమే ప్రజలకు అందజేస్తున్నామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన చూస్తే రోజూ ఉత్పత్తి అవుతున్న మొత్తం డోసుల్లో దాదాపు సగం మాత్రమే ప్రజలకు అందుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ