Flight: విమానంలో సురక్షితమైన సీటు ఏదో తెలుసా..?

విమాన ప్రయాణాల్లో ఎక్కువ మంది విండో సీటుకు ప్రాధాన్యమిస్తారు. కానీ, భద్రతపరంగా విమానంలో సురక్షితమైన సీటు అది కాదంటున్నారు విమానయానరంగ నిపుణులు. మరి, సురక్షితమైన సీటు ఏదో తెలుసా..?

Published : 10 Feb 2023 01:34 IST

దిల్లీ: విమాన ప్రయాణాల్లో ఎక్కువ మంది విండో సీటు కోరుకుంటారు. విమానం (Flight) గాల్లో ఉన్నప్పడు విండో నుంచి మేఘాలను చూస్తూ ప్రయాణించవచ్చని చాలా మంది ఆ సీటుకు ప్రాధాన్యమిస్తుంటారు. ఆ సమయంలో భద్రత (Safety) గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు. విమానంలో భద్రతపరంగా ఏ సీటు సురక్షితమైందో తెలుసా? ఇదే విషయాన్ని విమానయానరంగ నిపుణుల (Aviation Experts)ను అడిగితే, వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..? విమానంలో మధ్య సీటు ఎంతో సురక్షితమైందని అంటున్నారు ఆస్ట్రేలియాలోని సెంట్రల్‌ క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ (Central Queensland University)కి చెందిన విమానయానరంగ నిపుణుడు ప్రొఫెసర్‌ డౌగ్‌ డ్రూరీ. 

విమాన ప్రమాదాలు సంభవించినప్పుడు విండో సీటు, సీటింగ్ వరుస ప్రారంభంలో ఉండే సీటు (Aisle)తో పోలిస్తే మధ్యలో ఉండే సీటు సురక్షితమైనది ఆయన చెప్పారు. దీని వెనుక కారణాన్ని డ్రూరీ వివరించారు. ప్రమాదం సంభవించినప్పుడు విండో సీటుపై బయటి నుంచి, ఐల్‌ సీటుపై విమానం లోపలి నుంచి ముందుగా ప్రభావం ఉంటుందని తెలిపారు. అలానే ఎమర్జెన్సీ డోర్‌కు దగ్గరగా ఉన్న సీటు కూడా సురక్షితమైనదేనని చెప్పారు. ప్రమాద సమయంలో త్వరగా విమానం నుంచి బయటపడవచ్చని వెల్లడించారు. మధ్య సీట్లలో కూడా అన్ని వరుసల్లోనివి సురక్షితం కాదని డౌగ్‌ డూర్రీ చెబుతున్నారు. విమాన రెక్కల్లో ఇంధనం ఉంటుంది కాబట్టి, ఆ వరుసలో ఉండే మధ్య సీట్లపై ముందుగా ప్రభావం ఉంటుందని చెప్పారు. అలానే, వెనుక వరుసల్లోని మధ్య సీట్లతో పోలిస్తే.. ముందు వరుసల్లోని మధ్య సీట్లు సురక్షితం కాదని డౌగ్‌ డ్రూరీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని