ప్రధానిజీ దృష్టిసారించండి:ఐఎంఏ

కరోనా వైరస్‌పై చేస్తోన్న యుద్ధంలో ముందుండి పోరాడి, మనకు అండగా నిలుస్తున్నది వైద్యులే.

Published : 08 Aug 2020 20:24 IST

కరోనా కారణంగా 196 మంది వైద్యులు మృతి

 

దిల్లీ: కరోనా వైరస్‌పై చేస్తోన్న యుద్ధంలో ముందుండి పోరాడి, మనకు అండగా నిలుస్తున్నది వైద్యులే. కానీ ఈక్రమంలో వైరస్‌ బారిన పడి మరణిస్తోన్న వైద్యుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 196 మంది వైద్యులు మరణించారని, వారిలో ఎక్కువ మంది జనరల్‌ ప్రాక్టిషనర్లు ఉన్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) శనివారం వెల్లడించింది. ఈ అంశంపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది.  

‘ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 196 మంది వైద్యులు కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందారు. వారిలో 170 మంది 50 సంవత్సరాలు పైబడినవారు ఉండగా, 40 శాతం మంది జనరల్ వైద్యులే ఉన్నారు. అలాగే కరోనా ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అందరి మీద ఒకే రకమైన ప్రభావం చూపుతోంది. అన్నింటికంటే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే..చాలా సందర్భాల్లో వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు బెడ్లు, మందులు అందుబాటులో ఉండటం లేదు. ఈ మహమ్మారి కాలంలో వైద్యుల రక్షణ, సంక్షేమం మీద కేంద్రం దృష్టి సారించాలని అభ్యర్థిస్తున్నాం’ అని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రాజన్‌ శర్మ కోరారు. దేశవ్యాప్తంగా 3.5 లక్షల మంది వైద్యులకు ఐఎంఏ ప్రాతినిధ్యం వహిస్తోంది.

మామూలుగా జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైతే ప్రజలు సమీపంలోని వైద్యులను ఆశ్రయిస్తుంటారు. దాంతో కరోనా కారణంగా ఇప్పుడు వారే ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ తరుణంలో వైద్యులు, వారి కుటుంబాలు ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశం ఉండటంతో..అన్ని రంగాల్లో ఉన్న వైద్యులకు ప్రభుత్వం అందించే ఆరోగ్య, జీవిత బీమాను విస్తరించాలని ప్రధానికి రాసిన లేఖలో ఐఎంఏ అభ్యర్థించింది. 


 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని