Kerala: పిల్లి కరిచిందని ఆస్పత్రికి పోతే.. కుక్క కాటు

పెనంలోంచి పొయ్యిలోకి పడటమంటే ఇదే. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. అక్కడ కుక్క కరిచింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్‌లో జరిగింది.

Updated : 01 Oct 2022 07:23 IST

పెనంలోంచి పొయ్యిలోకి పడటమంటే ఇదే. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. అక్కడ కుక్క కరిచింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్‌లో జరిగింది. ఈ గ్రామానికి చెందిన అపర్ణను పిల్లి కరిచింది. వైద్యం కోసం ఆరోగ్యకేంద్రానికి వెళ్లిన ఆమె.. అక్కడున్న కుక్క తోకపై పొరపాటున కాలు పెట్టింది. కుయ్యిమంటూ లేచిన కుక్క.. అపర్ణ కాలిపై కాట్లు వేసింది. వైద్యులు ఆమెకు ప్రథమచికిత్స అందించి, జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని