
Cabin baggage:దేశీయ విమానాల్లో కేబిన్‌లోకి ఒకటే బ్యాగ్‌కు అనుమతి
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ విమానాల్లో ప్రయాణికులకు ఇకపై క్యాబిన్లోకి కేవలం ఒకే హ్యాండ్ బ్యాగ్‌తో ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు ఈ నిబంధనను అమలు చేయాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తాజాగా సర్క్యూలర్ జారీ చేసింది.
‘దేశీయ ప్రయాణికులు సగటున రెండు, మూడు హ్యాండ్ బ్యాగ్‌లను స్క్రీనింగ్ పాయింట్‌కి తీసుకెళ్తున్నారు. దీంతో క్లియరెన్స్ సమయం పెరుగుతోంది. తీవ్ర జాప్యంతోపాటు చెక్- ఇన్ కౌంటర్లలో రద్దీతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. సర్క్యూలర్‌లో పేర్కొన్న లేడీ బ్యాగ్, ఇతర వస్తువులు మినహాయించి ఒకటి కంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్‌లను తీసుకెళ్లేందుకు ప్రయాణికులను అనుమతించకూడదు’ అని బీసీఏఎస్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
బోర్డింగ్ పాస్‌లు, టికెట్లపై ‘వన్ హ్యాండ్ బ్యాగ్’ నియమాన్ని స్పష్టంగా ముద్రించాలని, విమానాశ్రయాల్లోనూ హోర్డింగ్‌లు, బ్యానర్లు, బోర్డుల ద్వారా ప్రయాణికులకు ఈ మేరకు సమాచారం అందజేయాలని బీసీఏఎస్ సూచించింది. దీంతో సంబంధిత ప్రయాణికులు అవసరమనుకుంటే వారి అదనపు హ్యాండ్ బ్యాగ్‌లను రిజిస్టర్డ్ బ్యాగేజీకి మార్చుకునే అవకాశం కలుగుతుందని తెలిపింది.