
Donald Trump: వుహాన్ ల్యాబ్ వద్ద బాడీ బ్యాగ్స్ గుట్టలు..!
ట్రంప్ సంచలన ఆరోపణలు
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం ‘ది ఆస్ట్రేలియన్’ అనే వార్తా సంస్థకు చెందిన ఇన్వెస్టిగేటింగ్ ఎడిటర్ షెర్రీ మార్క్సన్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘వాట్ రియల్లీ హ్యాపెన్డ్ ఇన్ వుహాన్’ అనే కార్యక్రమంలో భాగంగా 30 నిమిషాలపాటు పలు విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తి మొదలైన 2020 తొలి నాళ్లలో ‘వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ’బయట బాడీ బ్యాగ్స్ కుప్పలు పడిఉన్నట్లు ఫొటోలున్నాయని చెప్పారు. అప్పటికే పరిస్థితి ఘోరంగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
కాకపోతే ట్రంప్ దీనికి తగిన ఆధారాలను చూపించలేదు. మీరంతా విన్న కథనాలే నేనుకూడా విన్నాను. వుహాన్ వీధుల్లో ప్రజలు పడిపోయి ఉన్నారని, బాడీ బ్యాగ్‌లు తెచ్చారని మీరంతా విన్నట్లే నేను కూడా విన్నానని ట్రంప్ వెల్లడించారు.
‘‘ఈ వైరస్ ల్యాబ్ నుంచి వ్యాపించి ఉంటుందని మన విచక్షణాజ్ఞానం చెబుతుంది. 95శాతం అదే నిజం కావచ్చు. వుహాన్ ల్యాబ్ నుంచే వెలువడి ఉంటుంది. వారి చెడు ఉద్దేశాలు ఉన్నయా..? లేవా అన్నది నాకుతెలియదు. అది వారి అసమర్థత వల్ల కూడా బయటకు లీకై ఉండొచ్చు. మరేదైనా కానీయండి.. అది వుహాన్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని అమెరికాలో చెబితే వారు.. వారు పిచ్చిగా ప్రవర్తించారు. అలా ఎందుకు ప్రవర్తించారో తెలియదు’’ అని వ్యాఖ్యానించారు.
షెర్రీ మార్క్సన్ను చైనా పత్రికలు గతంలో తీవ్రంగా విమర్శించాయి. ‘ల్యాబ్ లీక్ ’ థియరీని ఆమె ప్రచారం చేస్తోందని చైనాకు చెందిన పీపుల్స్ డెయిలీ ఆగస్టులో మండిపడింది. ఆమె కొవిడ్ పుట్టుకపై దర్యాప్తును రాజకీయం చేస్తోందని పేర్కొంది. దీనికి అమెరికాలోని రైట్‌వింగ్ సర్కిల్‌ను వాడుకొంటోందని పేర్కొంది.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.