Trump: సీక్రెట్‌ సర్వీసుకు ట్రంప్‌ షాక్‌..!

మాజీ అధ్యక్షుడి హోదాలో తనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందికి కేటాయించిన గదులపై ట్రంప్‌

Published : 24 May 2021 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడి హోదాలో తనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చిన గదులపై ట్రంప్‌ హోటల్‌ భారీగా బిల్లు వేసింది. గత జనవరిలో ట్రంప్‌ శ్వేత సౌధం వీడాక ఫ్లోరిడాలోని మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో ఉంటున్నారు. ఆయనకు కొంత మంది సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. వారికి కూడా అదే రిసార్ట్‌లో గదులను కేటాయించారు. ఇప్పుడు జనవరి నుంచి ఏప్రిల్‌ 30 వరకు 40,011 డాలర్ల బిల్లును వేశారు. రోజుకు 396.15 డాలర్ల చొప్పున బిల్లు వేశారు. ఈ విషయాన్ని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇందుకోసం ఆ పత్రిక పబ్లిక్‌ రికార్డు రిక్వెస్ట్‌ను దాఖలు చేసింది. ది ఫెడరల్‌ స్పెండింగ్‌ రికార్డ్స్‌ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌ పదవీకాలంలో ఆయన భద్రత కోసం 2.5 బిలియన్‌ డాలర్లను సీక్రెట్‌ సర్వీస్‌ ఖర్చుపెట్టింది. ట్రంప్‌కు ముందు అధ్యక్షులుగా చేసిన వారి ఖర్చుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ 2011 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన డెలవేర్‌లోని తన నివాసంలో కొన్ని గదులను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందికి కేటాయించారు. దానికి గాను నెలకు 2,200 డాలర్లు మాత్రమే ఛార్జి చేశారు. మొత్తం ఆరేళ్ల కాలానికి ఆయన ఛార్జి చేసిన మొత్తం 1,71,600 డాలర్లు మాత్రమే. ఈ బిల్లుతో పోలిస్తే ట్రంప్‌ కొన్ని నెలల్లోనే 40వేల డాలర్లు ఛార్జ్‌ చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని