Published : 05 May 2021 23:14 IST

Trump సోషల్‌ మీడియా... అదో రకం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ను అన్ని ప్రముఖ సోషల్‌  నెట్‌వర్కింగ్‌  కంపెనీలు నిషేధం విధించాయి. దీంతో ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ట్రంప్‌ తన సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేశారు. చూడటానికి బ్లాగ్‌లా కనిపిస్తున్న ఈ పేజీ... ట్రంప్‌ అధికారిక వెబ్‌సైట్‌లో భాగంగానే ఉంది. మరి ఈ సోషల్‌ మీడియా పేజీలో ఎవరెవరు ఉంటారు అనే ప్రశ్న అక్కర్లేదు. ఎందుకంటే ఆయనొక్కడే అందులో పోస్టులు చేస్తుంటారు. మీకు నచ్చితే వాటిని అక్కణ్నుంచి మీ ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో షేర్‌ చేసుకోవచ్చు. అన్నట్లు లైక్‌ కూడా కొట్టొచ్చు. 

ట్రంప్‌ తన సోషల్‌ మీడయా పేజీకి ‘ఫ్రమ్‌ ది డెస్క్‌ ఆఫ్‌ డొనాల్డ్‌ జూ. ట్రంప్‌’ అని పేరు పెట్టుకున్నారు. నెటిజన్లు  ఈ పేజీలో సైనప్‌ అయ్యి ఆయన పోస్టులను అలర్ట్‌ పెట్టుకోవచ్చు. దీని కోసం మీ మొబైల్‌ నెంబరు, ఈమెయిల్‌, పూర్తి పేరు ఇవ్వాల్సి ఉంటుంది.  అయితే ప్రస్తుతం ట్విటర్‌ షేర్‌ పని చేయడం లేదు. కేవలం ఫేస్‌బుక్‌ షేర్‌ మాత్రం పని చేస్తోంది. త్వరలో ట్విటర్‌ షేర్‌ కూడా తీసుకొస్తారట. అయితే మరి ఈ పోస్టుల్ని షేర్‌ చేస్తే ట్విటర్‌, ఫేస్‌బుక్‌ అంగీకరిస్తాయా అంటే... లేదనే చెబుతున్నారు నిపుణులు. తమ నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న వెబ్‌సైట్‌/బ్లాగ్‌ పోస్టును సోషల్‌ మీడియా సంస్థలు అంగీకరించవు. కాబట్టి ట్రంప్‌ వెబ్‌సైట్‌ పోస్టులను ఎవరైనా షేర్‌ చేస్తే. వాటిని డిలీట్‌ చేసే అవకాశమూ ఉందన్నమాట. 

ట్రంప్‌ సోషల్‌ మీడయా పేజీ అధికారికంగా మంగళవారమే లాంచ్‌ చేసినా... అందులో మార్చి 24 నుంచి పోస్టులు కనిపిస్తున్నాయి. కొత్త పోస్టుగా ట్రంప్‌ ఓ వీడియో పెట్టారు. అందులో చెప్పాలనుకున్న విషయాన్ని స్వేచ్ఛగా, రక్షణతో చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ పేజీ ద్వారా ట్రంప్‌ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారట. అయితే అదెలా జరుగుతుంది అనే విషయంలో ట్రంప్‌ మీడియా టీమ్‌ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ట్రంప్‌ను ఫేస్‌బుక్‌ ఖాతాను తిరిగి అనుమతించాలా వద్దా అని ఫేస్‌బుక్‌ నిర్ణయం తీసుకోవడానికి ఒక రోజు  ముందు ట్రంప్‌ ఇలా తన సోషల్‌ మీడియా పేజీని లాంచ్‌ చేయడం గమనార్హం. 

యూ.ఎస్‌. క్యాపిటల్‌ మీద దాడి, ఆ తర్వాతి పరిణామాల గురించి ట్రంప్‌ చేసిన కొన్ని పోస్టుల వల్ల ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ట్రంప్‌ సోషల్‌ మీడయా అకౌంట్ల మీద చర్య తీసుకున్నాయి. ట్రంప్‌ అకౌంట్లపై నిషేధం విధించాయి. అయితే ట్రంప్‌ ప్రస్తుతం లాంచ్‌ చేసిన వెబ్‌సైట్‌ను కాంపెయిన్‌ న్యూక్లియస్‌ రూపొందించింది. ఈ డిజిటల్‌ సర్వీసు సంస్థను ట్రంప్‌ మాజీ ప్రచార మేనేజర్‌ బ్రాడ్‌ పార్‌స్కేల్‌ స్థాపించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని