మహిళలూ..  అది ఫేక్‌న్యూస్‌! 

దేశాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్న వేళ టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ....

Published : 24 Apr 2021 19:31 IST

దిల్లీ: మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న తరుణంలో ఓ ఫేక్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. టీకా వేయించుకొనే ముందు మహిళలు తమ పీరియడ్స్‌ సమయాన్ని చెక్‌ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. మహిళలు పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత టీకా తీసుకోవద్దని, ఆ సమయంలో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల టీకా తీసుకుంటే ప్రమాదమంటూ జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ దుష్ప్రచారాన్ని మహిళలెవరూ నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విజ్ఞప్తి చేసింది.18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 28 నుంచి cowin.gov.inలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపింది. 

మరోవైపు, దేశాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్న వేళ టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 29లక్షల టీకాడోసులు పంపిణీ జరిగింది. నిన్నటివరకు  దేశవ్యాప్తంగా 13.83 కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వంవెల్లడించింది. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని