Published : 09 Jul 2021 23:42 IST

Delta: సిడ్నీలో ‘డెల్టా’ ప్రమాద ఘంటికలు

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీలో డెల్టా వేరియంట్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్‌ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో మూడు వారాల క్రితమే సిడ్నీలో లాక్‌డౌన్‌ విధించారు. అయినా కేసుల్లో తగ్గుదల కనిపించడంలేదు. టీకా తీసుకోనివారే అధిక శాతం వ్యాధి బారిన పడుతున్నట్లు అధికారులు తేల్చారు. డెల్టా వేరియంట్‌ కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన సిడ్నీ సర్కారు శుక్రవారం లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసింది. బయట ఒకేచోట ఇద్దరికంటే ఎక్కవ మంది కనిపిస్తే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్ర ప్రీమియర్‌ గ్లాడీ బెరెజిక్లియన్‌ శుక్రవారం మాట్లాడుతూ.. ఇల్లు విడిచి బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. ‘అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దు. ఇంట్లోనే ఉండి కొవిడ్‌ నియమాలు పాటించండి. కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా వేరియంట్‌ అన్ని రకాల వైరస్‌లకంటే అత్యంత ప్రమాదకరం. భారీగా మరణాలను నిరోధించాలంటే కఠిన నిబంధనలు పాటించకతప్పదు’ అని పేర్కొన్నారు.

కరోనాను నియంత్రించగలిగామని ఊపిరి పీల్చుకున్న సిడ్నీవాసులకు మళ్లీ వైరస్‌ సెగ తగిలింది. జూన్‌ నెల మధ్య నుంచి సిడ్నీలో 439 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 44 కేసులు బయటపడ్డాయి. 5 మిలియన్ల జనాభా ఉన్న సిడ్నీ నగరంలో ఇప్పటికి కేవలం 10 శాతం మందికే రెండు డోసుల టీకాలు ఇచ్చారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని