ఒకేరోజు 88లక్షల డోసులు.. టాప్‌ 10రాష్ట్రాలివే!

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా దేశంలో టీకా పంపిణీ వేగం పుంజుకుంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 87.6లక్షల డోసులు పంపిణీ చేశారు.....

Published : 22 Jun 2021 19:22 IST

దిల్లీ: కరోనా వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా దేశంలో టీకా పంపిణీ వేగం పుంజుకుంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 88.09లక్షల డోసులు పంపిణీ చేశారు. 36.32% వ్యాక్సినేషన్‌ పట్టణ ప్రాంతాల్లో జరగ్గా.. 63.68% వ్యాక్సినేషన్‌ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 16న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో డోసుల పంపిణీ జరగలేదు. ఏప్రిల్‌ 1న మాత్రమే 48లక్షల మందికి టీకా వేశారు. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకా అందించేలా ఇటీవల సవరించిన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చిన తొలిరోజే ఇంత భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్‌ జరిగింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా వ్యాక్సిన్లు పంపిణీ చేసిన తొలి 10 రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, యూపీ, బిహార్‌, హరియాణా, గుజరాత్, రాజస్థాన్‌, తమిళనాడు, మహారాష్ట్ర, అసోం ఉన్నాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 29.16 కోట్ల డోసులు పంపిణీ జరిగింది. వీటిలో 23.92 కోట్ల మందికి ఒక డోసు అందించగా.. 5.24కోట్ల మందికి రెండో డోసు కూడా పూర్తి చేసినట్టు కేంద్రం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు