Gold: 23 కిలోల బంగారం స్వాధీనం!

ఈశాన్య సరిహద్దుల ద్వారా భారత్‌కు బంగారం అక్రమ రవాణా కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ బోర్డర్‌ నుంచి ఇండియాలోకి అక్రమంగా తరలిస్తున్న 23.23 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 06 Oct 2022 01:32 IST

దిల్లీ: ఈశాన్య సరిహద్దుల ద్వారా భారత్‌కు బంగారం అక్రమ రవాణా కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ బోర్డర్‌ నుంచి ఇండియాలోకి అక్రమంగా తరలిస్తున్న 23.23 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిలిగుడి-గువాహటి మార్గంలో డీఆర్‌ఐ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా రెండు వాహనాల్లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వాహనాలను తనిఖీ చేయగా.. చక్రాల మధ్యలో తయారు చేసిన ప్రత్యేక భాగాల్లో 21 బంగారు కడ్డీలు ఉన్నాయి. వీటి విలువ రూ.11.65 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ పోలీసులు వెల్లడించారు.

ఒక్క సెప్టెంబరు నెలలోనే ఈ మార్గంలో తరలించేందుకు ప్రయత్నించిన 121 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. మరోవైపు ఇటీవల పట్నా, దిల్లీ, ముంబయిలో ఏకకాలంలో దాడులు చేసిన డీఆర్‌ఐ 65.46 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపు రూ.33.40 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని