Viral news: దారుణం.. లిఫ్ట్ ఇస్తే.. కారునే కొట్టేశారు!
నలుగురు వ్యక్తులు బరితెగించారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కారునే కొట్టేశారు. అతడి కళ్లలో కారం కొట్టి, బలవంతంగా కారు ఎత్తుకుపోయారు. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది.
నోయిడా: దిల్లీలో నలుగురు దుండగులు బరి తెగించారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కారునే కొట్టేశారు. అతడి కళ్లలో కారం కొట్టి, బలవంతంగా కారు ఎత్తుకుపోయారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని సెక్టార్-93లో ఉండే ఓ వ్యక్తి దిల్లీలో పని చేస్తున్నాడు. గత బుధవారం కారులో వెళ్తుండగా మధ్యలో నలుగురు వ్యక్తులు ఆపి లిఫ్ట్ అడిగారు. తాము కూడా దిల్లీకే వెళ్తున్నామని చెప్పారు. ఛార్జీలు ఇవ్వాలన్న ఒప్పందం మేరకు వారిని ఆ వ్యక్తి కారులోకి ఎక్కించుకున్నాడు. అయితే కొద్ది దూరం వెళ్లేసరికి ఆ నలుగురూ కారు యజమాని కళ్లలో కారం కొట్టేసి కారును గురుగ్రామ్, హరియాణా వైపు మళ్లించారు. మధ్యలో కారు యజమానిని బలవంతంగా కిందకు తోసేసి కారును ఎత్తుకుపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ‘‘ ఈ ఘటనపై నోయిడా సెక్టార్ 20 పోలీస్‌స్టేషన్‌లో సెప్టెంబరు 23న జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫేజ్ 2 పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితులు ఉన్నట్లు గుర్తించి వారిని ఆదివారం పట్టుకున్నాం’’ అని సెంట్రల్ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మియాన్ ఖాన్ మీడియాకు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Director Sagar: సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత
-
Politics News
Balineni: నిరూపించలేకపోతే పోటీనుంచి తప్పుకొంటారా?: కోటంరెడ్డికి బాలినేని సవాల్
-
General News
Top Ten News @ 9 AM: బడ్జెట్ ప్రత్యేకం.. ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Buggana: సీఎం ఎక్కడుంటే అదే పరిపాలన రాజధాని: బుగ్గన
-
World News
Pakistan: ముజాహిదీన్లను సృష్టించి తప్పు చేశాం: పార్లమెంటులో పాక్ మంత్రి
-
Politics News
Padi Kaushik Reddy: హుజూరాబాద్‌లో భారాస అభ్యర్థిని నేనే: పాడి కౌశిక్‌రెడ్డి