Tusker Kabali: బస్సును వెంటాడిన ఏనుగు.. రివర్స్ గేర్‌లో 8 కి.మీ వెనక్కి
అటవీ మార్గంలో వెళ్తోన్న ఓ ప్రయాణికుల బస్సును ఓ ఏనుగు వెంటాడిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. దీంతో బస్సును సుమారు 8 కి.మీ రివర్స్ గేరులోనే తీసుకువచ్చాడు. చివరకు ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
త్రిశూర్: కేరళలోని అటవీ ప్రాంత మార్గంలో వెళ్తోన్న ఓ ప్రయాణికుల బస్సుకు ఊహించని పరిణామం ఎదురైంది. బస్సుకు ఎదురుగా పొడవైన దంతాల ఓ ఏనుగు ఆగ్రహంతో దూసుకొచ్చింది. దాన్ని తప్పించుకొని ముందుకెళ్లే అవకాశం లేదు. తిరిగి చూస్తే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికుల్లో ఆందోళన. ఆ డ్రైవర్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. మెల్లగా రివర్స్ గేర్ వేసి బస్సును వెనక్కి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అలా కొద్ది దూరం కాదు.. ఏకంగా ఎనిమిది కి.మీ దూరం వెళ్లాక ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో డ్రైవర్‌తోపాటు ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని చాలకుడి నుంచి వాల్పరాయ్ మార్గంలో ఓ ప్రైవేట్ బస్సు వెళ్తోంది. అదే సయమంలో ఎదురుగా వచ్చిన ఓ ఏనుగు (Wild Tusker).. బస్సును అడ్డగించింది. అక్కడితో ఆగిపోకుండా బస్సు వైపే ఆగ్రహంతో పరుగులు తీయడంతో ఆందోళన చెందిన 40 ప్రయాణికులు డ్రైవర్‌ను వెనక్కి పోనివ్వాలని సూచించారు. అలాగే చేసిన డ్రైవర్.. ఇరుకైన, వంకర రోడ్డులోనే అంబలాపర నుంచి అనక్కయాం వరకు రివర్సు గేరులోనే బస్సును వెనక్కి సాగనిచ్చాడు. అక్కడివరకు వెంటాడిన ఆ ఏనుగు.. చివరకు ఓ గ్రామం సమీపంలోకి రాగానే అడవులోకి వెళ్లిపోయింది.
‘ఇది మరచిపోలేని ఘటన. అందరూ భయంతో వణికిపోయారు. బస్సును రివర్సులో తీసుకురావడం తప్ప మరో మార్గం లేదు’ అని డ్రైవర్ అంబుజాక్షన్ వెల్లడించారు. ఆ ఏనుగు పేరు ‘కబాలి’ అని.. రెండేళ్లుగా తరచూ ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు