అగ్నిపర్వతంలో కూలిన డ్రోన్‌

‘అంగారక గ్రహం మీద కూడా ఫొటోలు తీసేటంత సాంకేతిక అభివృద్ధి చెందింది నేడు. అలాంటిది అగ్ని పర్వతాన్ని కెమెరాలో బంధించడం ఓ లెక్కా?!’ అనుకున్నాడు జోయి హెల్మ్ప్‌ అనే యూట్యూబర్‌.

Updated : 06 Jul 2021 20:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అంగారక గ్రహం మీద కూడా ఫొటోలు తీసేటంత సాంకేతిక అభివృద్ధి చెందింది నేడు. అలాంటిది అగ్ని పర్వతాన్ని కెమెరాలో బంధించడం ఓ లెక్కా?!’ అనుకున్నాడు జోయి హెల్మ్ప్‌ అనే యూట్యూబర్‌. అందుకోసం కొత్తగా ఒక డ్రోన్‌ కెమెరా కొన్నాడు. ఐస్‌లాండ్‌లో మార్చి 19 నుంచి విస్ఫోటం చెందుతున్న అగ్ని పర్వతాన్ని వీడియో తీయడానికి సిద్ధమయ్యాడు. అనుకున్నట్టుగానే డ్రోన్‌ కెమెరాను అగ్నిపర్వతం మీద ఎగురవేసి వీడియో తీయడం మొదలుపెట్టాడు. సరిగ్గా అగ్నిపర్వతం మధ్యలోకి డ్రోన్‌ వెళ్లే సరికి లావా ఒక్కసారిగా పైకి చిమ్మింది. దాంతో డ్రోన్‌  అగ్నిపర్వతంలోకి కూలిపోయింది. డ్రోన్‌, కెమెరా పోతే పోయింది కానీ.. అద్భుతమైన వీడియో అతనికి లభించింది. ఆ వీడియోను మే 26న తన యూట్యూబ్‌లో పంచుకోగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు లక్షన్నరకు పైగా వీక్షణలు వచ్చాయి. మరి అద్భుతమైన ఆ వీడియోను మీరూ ఒకసారి చూసేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని