drone: పాక్‌ సహకారంతోనే డ్రోన్ల దాడి ..!

పాక్‌ ప్రభుత్వ సహకరిస్తేనే డ్రోన్‌దాడి సాంకేతికత ఉగ్రవాదులకు చేరిందని చినార్‌ కోర్‌ (15వ కోర్‌) కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీపీ పాండే పేర్కొన్నారు.

Updated : 09 Dec 2022 13:58 IST

 తేల్చి చెప్పిన ‘చినార్‌ కోర్‌’ కమాండర్‌ డీపీ  పాండే

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ ప్రభుత్వ సహకారంతోనే డ్రోన్‌దాడి సాంకేతికత పరిజ్ఞానం ఉగ్రవాదులకు చేరిందని చినార్‌ కోర్‌ (15వ కోర్‌) కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీపీ పాండే పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో లష్కరే తొయిబా,జైషే మహమ్మద్‌ ప్రమేయం ఉండే అవకాశం ఉందన్నారు.  పాక్‌ సైన్యానికి డ్రోన్లు, డ్రోన్ల టెక్నాలజీ, యుద్ధతంత్రంపై  అవగాహన ఉందని.. ఇది ఆ ప్రభుత్వ సాయంతో నడుస్తోందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా ఇవి కొనసాగవచ్చని అన్నారు. సైనిక దళాలు వీటిని ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాలను పరిగణలోకి తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుందన్నారు. 

ఈ కేసులో విషయాలు బయటకు తెలిస్తే దర్యాప్తునకు ఇబ్బందిగా మారుతుందన్నారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత మాత్రం ఎంతో కొంత పాక్‌ ప్రభుత్వం అండ ఈ శక్తులకు ఉందని అర్థమైందన్నారు. జమ్ముకశ్మీర్‌లో గత నాలుగేళ్లుగా శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌ పోలీసులు కూడా ఈ దాడిలో లష్కరే పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ఇటీవల బనిహాల్‌ అనే లష్కరే ఆపరేటర్‌ను అరెస్టు చేయడంతో ఇది మరింత బలపడింది. అతని వద్ద నుంచి 4 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు. జమ్ము వాయుసేన స్థావరంపై దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. ఇప్పటికే కొన్నేళ్లుగా పాక్‌ సరిహద్దుల్లో ఆయుధాలను జారవిడిచేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని