Resort Murder: అక్కడ విచ్చలవిడిగా వ్యభిచారం, మద్యం..!

రిసార్టులో పనిచేస్తోన్న19 ఏళ్ల యువతి హత్య ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది.

Published : 28 Sep 2022 01:34 IST

దేహ్రాదూన్‌: రిసార్టులో పనిచేస్తోన్న19 ఏళ్ల యువతి హత్య ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగిని ఒకరు తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడించారు. 

‘నేను ఆ రిసార్టులో మేలో చేరాను. కానీ జులైలోనే ఉద్యోగం మానేశాను. హత్య కేసులో ప్రధాన నిందితుడైన పుల్కిత్ ఆర్య, అతడి సిబ్బంది ఒకరు మహిళలతో తప్పుగా ప్రవర్తించేవారు. మాటలతో వేధింపులకు గురిచేసేవారు. వారు అమ్మాయిలను తీసుకువచ్చేవారు. ఈ రిసార్టుకు వీఐపీలు కూడా వచ్చేవారు. ఇక్కడ అతిథులకు అక్రమంగా మద్యం, గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసేవారు. నన్ను కూడా ఆ కూపంలోకి లాగాలని చూస్తున్నారని నాకనిపించింది. అందుకే అక్కడి నుంచి బయటపడ్డాను’ అని ఆమె మీడియాకు వెల్లడించారు. అక్కడే ఆమె భర్త హౌస్‌కీపర్‌గా పనిచేసేవాడు. ఆగస్టులో సదరు యువతి చేరడానికి ముందు వీరు ఉద్యోగం వదిలివెళ్లిపోయారు. 

భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్‌ ఆర్యకు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు దగ్గర్లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి గతవారం హత్యకు గురైంది. కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె ‘ప్రత్యేక’సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్కిత్‌, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్‌ కాల్ వివరాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts