టీకా భద్రతాపర్యవేక్షణను మరింత పెంచండి

ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కొందరికి వ్యాక్సిన్ ఇచ్చినందున భద్రతా పర్యవేక్షణను మరింత పెంచాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)ను భారత ఔషధ నియంత్రణ సంస్థ కోరింది.

Published : 12 Sep 2020 18:44 IST

ఎస్‌ఐఐను కోరిన ఔషధ నియంత్రణ సంస్థ 

పుణె: ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కొందరికి టీకా ఇచ్చినందున భద్రతా పర్యవేక్షణను మరింత పెంచాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)ను భారత ఔషధ నియంత్రణ సంస్థ కోరింది. అలాగే ఆ ప్రక్రియకు సంబంధించిన ప్రణాళిక, నివేదికను సమర్పించాలని చెప్పింది. మూడో దశలో ఉన్న వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ఒక వాలంటీరుకు అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆక్స్‌ఫర్డ్ వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భారత్‌లో కూడా ఆ ట్రయల్స్‌కు బ్రేక్‌ పడింది. ఈ సమయంలో ఎస్‌ఐఐకు నియంత్రణ సంస్థ ఈ ఆదేశం జారీ చేసింది. అలాగే అప్పటి వరకు వాలంటీర్ల నియామకం చేపట్టవద్దని వెల్లడించింది. అంతేకాకుండా నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందాలంటే ఎస్‌ఐఐ భారత్‌, యూకే కు చెందిన డేటా అండ్ సేప్టీ మానిటరింగ్ బోర్డ్(డీఎస్‌ఎంబీ) నుంచి పొందిన అనుమతి పత్రాన్ని సమర్పించాలని సూచించింది. 

కాగా, డీఎస్‌ఎంబీ సమీక్ష జరుపుతోందని, దాని సిఫార్సులను అందజేస్తామని ఎస్‌ఐఐ వెల్లడించింది. అలాగే ట్రయల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన డీఎస్‌ఎంబీ ఎలాంటి భద్రతాపరమైన సమస్యలను గుర్తించలేదని నియంత్రణ సంస్థకు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని