Indigo: మద్యం తాగి విమానంలో వాంతులు.. టాయిలెట్‌ వద్ద మలవిసర్జన

ఇండిగో (IndiGo) విమానంలో దుశ్చర్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తప్పతాగి తన సీటు పక్కనే వాంతులు చేసుకున్నాడు. టాయిలెట్‌ వద్ద మలవిసర్జన చేశాడు.

Published : 30 Mar 2023 14:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌ ఇండియాలో (Air India) మూత్రవిసర్జన ఘటన మరువకముందే ఇండిగో (IndiGo) విమానంలో మరో దుశ్చర్య చోటుచేసుకుంది. మార్చి 26న గువాహటి నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో ఓ వ్యక్తి తప్పతాగి తన సీటు పక్కనే వాంతులు చేసుకున్నాడు. టాయిలెట్‌ వద్ద మలవిసర్జన చేశాడు. దీంతో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోను అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది ట్విటర్‌లో పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆ పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించిన విమాన సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ‘‘ఓ వ్యక్తి తప్పతాగి సీట్ల పక్కనే వాంతి చేసుకున్నాడు. టాయిలెట్‌ వద్ద మలవిసర్జన చేశాడు. శ్వేత అనే యువతి ఆ చోటంతా శుభ్రం చేసింది. అమ్మాయిలందరూ  పరిస్థితిని చక్కదిద్దారు. మహిళా శక్తికి నా సెల్యూట్’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన యూజర్లు సంఘటనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

విమానాల్లో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మద్యం మత్తులో కొందరు ప్రయాణికులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఎయిరిండియా విమానంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. తప్పతాగి ఓ ప్రయాణికుడు ఓ మహిళపై మూత్ర విసర్జన చేయగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది జరిగిన పది రోజులకే తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మరో వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడిన ఘటన కూడా వివాదాస్పదమైంది. విమానాల్లో పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం గర్హనీయం.  ఈ సమస్యను అరికట్టాలంటే విమానాల్లో మద్యం తాగడం నిషేధించాలని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని