Uttar Pradesh: రైల్లో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..! టీటీఈ అరెస్టు

రైల్లో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలపై ఓ టీటీఈని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఈ ఘటన వెలుగుచూసింది.

Published : 14 Mar 2023 14:37 IST

లఖ్‌నవూ: విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన(Unruly Behaviour) ఘటనలు చర్చనీయాంశంగా మారుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇదే తరహా ఘటన తాజాగా ఓ రైల్లో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో నిందితుడు ఓ రైల్వే అధికారి(TTE) కావడం గమనార్హం. మద్యం మత్తులో అతను ఓ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు రావడంతో.. రైల్వే పోలీసులు(Railway Police) అతన్ని అరెస్టు చేశారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం అమృత్‌సర్‌- కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌’లో ప్రయాణించారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో రైలు లఖ్‌నవూను సమీపిస్తుండగా.. ఆ మహిళ కేకలు విని ప్రయాణికులంతా గుమిగూడారు. అప్పటికే ఆమె.. మద్యం మత్తులో ఉన్న టికెట్‌ తనిఖీ అధికారి(టీటీఈ)ని పట్టుకుని ఉన్నారు. తనపై మూత్ర విసర్జన చేసినట్లు ఆమె ఆరోపించారు. దీంతో రైలు లఖ్‌నవూ చేరుకున్న అనంతరం అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని బిహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. ఈ మేరకు టీటీఈపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని