Published : 08 May 2021 14:45 IST

Dry Swab Test: మూడు గంటల్లోనే ఫలితం

ముంబయి: కొవిడ్‌ నిర్ధరణలో కచ్చితమైన ఫలితాలనిచ్చే కొత్త రకం పరీక్షను అందుబాటులోకి తెచ్చారు మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్తలు. కేవలం మూడు గంటల్లోనే ఫలితాలనిచ్చే ‘డ్రై స్వాబ్‌ టెస్ట్‌’ ప్రస్తుతం నేషనల్‌ ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ విధానాన్ని మరిన్ని ప్రయోగశాలలకు విస్తరిస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.

కరోనా నిర్ధరణ పరీక్షల కోసం చేసే ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌లో ఫలితాల కోసం సుమారు 48 గంటలు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు ఆర్టీపీసీఆర్‌ కంటే వేగంగా కచ్చితమైన ఫలితాలనిచ్చే డ్రై స్వాబ్‌ టెస్టును అందుబాటులోకి తెచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని