Dubai: తొలి కాగితరహిత ప్రభుత్వంగా దుబాయ్‌ రికార్డు!

పర్యావరణహితం కోసం ప్రపంచదేశాలు కాగితరహిత కార్యకలాపాలు సాగించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే  తొలి కాగితరహిత ప్రభుత్వంగా దుబాయ్‌ ఎమిరేట్స్‌ నిలిచింది. తమ ప్రభుత్వంలో 100శాతం కాగిత రహిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఎమిరేట్స్‌ యువరాజు షేక్‌ హమ్‌దాన్‌ బిన్‌ మొహ్మద్‌ బిన్‌

Published : 13 Dec 2021 11:27 IST

దుబాయ్‌: పర్యావరణహితం కోసం ప్రపంచదేశాలు కాగితరహిత కార్యకలాపాలు సాగించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే తొలి కాగితరహిత ప్రభుత్వంగా దుబాయ్‌ ఎమిరేట్స్‌ నిలిచింది. తమ ప్రభుత్వంలో 100శాతం కాగిత రహిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఎమిరేట్స్‌ యువరాజు షేక్‌ హమ్‌దాన్‌ బిన్‌ మొహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మఖ్తుమ్‌ ప్రకటించారు. అంతర్గత, బహిర్గత లావాదేవీలు.. ఫైల్స్‌ బదిలీలు అన్నీ ఇప్పుడు కాగితం ఉపయోగించకుండా డిజిటల్‌గా చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 350 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు, 1.40లక్షల పని గంటలు ఆదా చేసినట్లు పేర్కొన్నారు.

‘ఈ లక్ష్యం సాధించడం ద్వారా దుబాయ్‌ నిత్య జీవితంలోని అన్ని అంశాలను డిజిటలైజ్‌ చేయడానికి ఒక కొత్త దశకు నాంది పలికినట్లుగా భావిస్తున్నాం. ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్తుపై దృష్టి సారించే ప్రయాణమిది’’అని యువరాజు షేక్‌ హమ్‌దాన్‌ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ సేవల కోసం అక్కడి ప్రభుత్వం ‘దుబాయ్‌ నవ్‌’ యాప్‌ను రూపొందించింది. పౌరులకు ఇందులో 12 కేటగిరిల్లో 130 స్మార్ట్‌ సిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 

యునైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌(యూఏఈ) మొత్తం కాగితరహితంగా మార్చేందుకు ఐదు దశల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట దుబాయ్‌ కాగితరహిత ప్రభుత్వంగా అవతరించింది. ఐదు దశలు పూర్తయ్యేసరికి యూఏఈలో ఉన్న అన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కాగితరహితంగా మారనున్నాయి.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని