EAM Jaishankar: సౌదీ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్‌ భేటీ..

సౌదీ విదేశాంగ శాఖ మంత్రి ఫైసల్‌ బిన్‌ అన్‌ సౌద్‌ మూడు రోజులపాటు భారత్‌ పర్యటన ప్రారంభమైంది. ఆయన నిన్న సాయంత్రం

Published : 19 Sep 2021 23:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సౌదీ విదేశాంగ శాఖ మంత్రి ఫైసల్‌ బిన్‌ అన్‌ సౌద్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన నిన్న సాయంత్రం ఇక్కడకి చేరుకొన్నారు. ఆదివారం ఉదయం భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆయనతో భేటీఅయి పలు విషయాలపై చర్చించారు. సోమవారం అల్‌ సౌద్‌ బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానుంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం దక్కించుకొన్న సమయంలో ఈ పర్యటన జరగడం ప్రాధాన్యం సంతరించుకొంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌- అల్‌ సౌద్‌ మధ్య జరిగిన చర్చల్లో అఫ్గానిస్థాన్‌ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. భవిష్యత్తులో కాబుల్‌పై  ప్రభావం చూపించే దేశాల్లో సౌదీ కీలకమైంది. ఇప్పటికే ఖతార్‌,ఇరాన్‌,యూఏఈ వంటి దేశాలు శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించాయి. 

ఇటీవల కాలంలో భారత్‌-సౌదీ మధ్య బంధం బలపడుతోంది. గత డిసెంబర్‌లో ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే సౌదీ అరేబియాను సందర్శించారు. భారత ఆర్మీ చీఫ్‌ సౌదీలో అధికారిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆ సమయంలో సౌదీ సైనిక జనరల్స్‌తో ఆయన కీలక అంశాలపై చర్చించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని