దిల్లీ, పంజాబ్‌లో భూప్రకంపనలు

దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్...

Updated : 12 Feb 2021 23:26 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. జమ్ము కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌‌, హరియాణా, నోయిడా, రాజస్థాన్‌లో భూప్రకంపనలు సంభవించాయి. తజకిస్థాన్‌లో భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. పంజాబ్‌లోనూ భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. అమృత్‌సర్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొంది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇవాళ రాత్రి 10.34 గంటలకు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని