Delhi: నేపాల్‌లో భూకంపం.. దిల్లీలో భారీ ప్రకంపనలు

నేపాల్‌లో భూకంపం కారణంగా దిల్లీ (Delhi)లో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Updated : 24 Jan 2023 15:29 IST

దిల్లీ: పొరుగు దేశం నేపాల్‌ (Nepal)లో భూకంపం (earthquake) సంభవించింది. దీంతో దేశ రాజధాని దిల్లీ (Delhi)లో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దిల్లీ-ఎన్‌సీఆర్‌ సహా ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రతకు ఇంట్లోని వస్తువులు కదిలిన దృశ్యాలను దిల్లీ వాసులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రకంపనల ధాటికి ఫ్యాన్లు, షాండ్లియర్‌ ఊగుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా.. దిల్లీలో భూమి కంపించడం (tremors) ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఈ మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటివరకు సమాచారం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని