అంటార్కిటికాలో భారీ భూకంపం!

అంటార్కిటాలోని దక్షిణ షెట్​ల్యాండ్​ దీవులను శనివారం భూకంపం కుదిపేసింది. రిక్టర్​ స్కేలుపై 7.3 తీవ్రత నమోదైంది. భూకంపంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు........

Updated : 24 Jan 2021 09:45 IST

చిలీ: అంటార్కిటికాలోని దక్షిణ షెట్​ల్యాండ్​ దీవులను శనివారం భూకంపం కుదిపేసింది. రిక్టర్​ స్కేలుపై 7.3 తీవ్రత నమోదైంది. భూకంపంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చిలీ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలో ఉన్న  ప్రజల్ని ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 10 కి.మీల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. భూకంపం కారణంగా ఏమైనా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందా అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు.

ఇవీ చదవండి...

పాక్‌ సరిహద్దుల్లో మరో సొరంగం

భారత్‌ టీకా మాకు సంజీవని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని