అస్సాం, బిహార్‌లో భూకంపం..!

అస్సాంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు యూరోపియన్‌ సిస్మోలజీ కేంద్రం(ఈఎంఎస్‌సీ) ధ్రువీకరించింది.

Updated : 28 Apr 2021 12:45 IST

గువహటి: అస్సాంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం  (ఎన్‌ఎసీసీ) ధ్రువీకరించింది. అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం భూకంపం సంభవించినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘అస్సాంలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. పూర్తి వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది’ అంటూ హిమంత ట్వీట్‌లో పేర్కొన్నారు. సోనిత్పూర్‌ జిల్లా, దేకియాజులీ కేంద్రంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు. గువహటిలో భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమైన చిత్రాలను సైతం పోస్ట్‌ చేశారు.

బిహార్‌లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కతిహార్‌, కిసాన్‌గంజ్‌, ఖడ్జియా ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపలేఖినిపై తీవ్రత 6.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

అన్నివిధాల సహాయం చేస్తాం: మోదీ
అస్సాలో బుధవారం భూకంపం సంభవించడంపై ప్రధాని మోదీ స్పందించారు. రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘అస్సాంలో భూప్రకంపనలపై సీఎం సర్బానంద సోనోవాల్‌తో మాట్లాడాను. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం చేస్తామని భరోసా ఇచ్చాం. అస్సాం ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌లో వెల్లడించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని