క్రొయేసియాలో భూకంపం.. ఏడుగురి మృతి

ఐరోపా ఖండంలోని క్రొయేసియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది.

Updated : 30 Dec 2020 13:33 IST

జాగ్రెబ్‌ : ఐరోపా ఖండంలోని క్రొయేసియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రాజధాని జాగ్రెబ్‌కు ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైంది. పెత్రింజా పట్టణంలో దాదాపు అన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగెత్తారు. ఏడుగురు మృతి చెందగా 20 మంది వరకూ గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు. ఇదే పట్టణంలో సోమవారం కూడా 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. బుధవారం కూడా సహాయక చర్యలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇవీ చదవండి..
తల్లిదండ్రులపై కుమారుడి దాడి..తల్లి మృతి

ఏడేళ్ల బాలుడికి బియ్యం కార్డు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని