Earthquake: దిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

దిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Updated : 21 Mar 2023 23:27 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌లలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లలోని కొన్నిచోట్ల ప్రకంపనలు వచ్చాయి. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌కు 133 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూప్రకంనలతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దేశరాజధాని దిల్లీలోని పలు ప్రదేశాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. నోయిడాలో పలు ఇళ్లలో సామగ్రి కింద పడింది.  పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌,లాహోర్‌, పెషావర్‌ రావల్పిండిలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు