ఎన్నికల కమిషన్‌ డేటా ఆధారంగా టీకాలు..?

కొవిడ్‌ టీకాలను వరుసక్రమంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ వద్ద డేటాను వినియోగించుకోనుంది. లబ్ధిదారులను గుర్తించి వ్యాక్సిన్‌ను వారికి చేర్చేందుకు

Published : 15 Jan 2021 23:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ టీకాలను వరుస క్రమంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ వద్ద డేటాను వినియోగించుకోనుంది. లబ్ధిదారులను గుర్తించి వ్యాక్సిన్‌ను వారికి చేర్చేందుకు దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి ప్రభుత్వ కార్యక్రమం ముగిశాక పూర్తి డేటాను ఆరోగ్య విభాగం డిలీట్‌ చేసేయాలని ఎన్నికల సంఘం షరతు విధించినట్లు సమాచారం. పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 50ఏళ్లు పైబడిన వారిని గుర్తించేందుకు ఎన్నికల సంఘం సహాయం చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఈసీకి లేఖరాశారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చే డేటాకు అత్యుత్తమ స్థాయి సైబర్‌ సెక్యూరిటీ అందిస్తామని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.  కేవలం వ్యాక్సినేషన్‌ కోసం మాత్రమే ఈ డేటాను వినియోగిస్తామని వెల్లడించారు. అంతకు ముందే ఆరోగ్యశాఖ, నీతిఆయోగ్‌ సభ్యులు ఈసీని కలిశారు. ఆ తర్వాత డిసెంబర్‌ 31న హోంశాఖ అధికారులు లేఖ రాశారు. 

జనవరి 4న ఈసీ దీనికి సమాధానం ఇచ్చారు. వ్యాక్సినేషన్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆయన వెల్లడించారు. కాకపోతే ఏ అవసరం కోసం తీసుకొన్నారో.. దానికే వినియోగిస్తామని హామీ ఇవ్వాలని కోరారు. ఒక సారి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముగిశాక ఆరోగ్యశాఖ అధికారులు డేటాను పూర్తిగా డిలీట్‌ చేయాలని సూచించారు. దీంతోపాటు రోజువారీ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి కొందరు ఈసీ సిబ్బంది హోంశాఖ, ఆరోగ్యశాఖ సిబ్బందితో టచ్‌లో ఉంటారు. దీంతో లోక్‌సభ, తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల సమయంలో అప్‌డేట్‌ అయినా డేటాను ప్రభుత్వం వాడుకొనేందుకు అవకాశం లభించింది. వ్యాక్సిన్‌ లబ్ధిదారులను గుర్తించేందుకు దీనిని వాడనున్నారు.  తొలి విడతలో కోటిమంది వైద్య సిబ్బంది, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాను అందిస్తారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి.. లేదా 50 ఏళ్లకంటే తక్కువ ఉన్నా.. ఇతర ఆరోగ్యసమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇవ్వనున్నారు. 

ఇవీ చదవండి

వ్యాక్సినేషన్‌.. ఈ రూల్స్‌ మర్చిపోవద్దు

‘మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది’

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని