
National Voter's Day: ఓటర్లకు ఎన్నికల సంఘంపోటీలు!
దిల్లీ: దేశం ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకొంటున్న విషయం తెలిసిందే. మంగళవారం ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ‘జాతీయ ఓటర్ల అవగాహన’ పోటీలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ‘మై ఓట్ ఈజ్ మై ఫ్యూచర్ - పవర్ ఆఫ్ వన్ ఓట్’ పేరుతో సోషల్మీడియాలో ఈ పోటీలను ప్రారంభించనున్నట్లు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా పాటలు, క్విజ్ పోటీలు ఉంటాయి. అలాగే.. నినాదాలు, వీడియో రూపొందించడం, పోస్టర్ డిజైన్ చేయడంలోనూ పోటీలు నిర్వహిస్తాం. ప్రజలందరికీ ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. విజేతలకు నగదు బహుమతి ఇస్తాం’’ అని ఈసీ ప్రకటనలో పేర్కొంది.
ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు జాతీయ అవార్డులు సైతం అందజేయనున్నారు. అలాగే, ఎన్నికల సంఘానికి సహకరించిన ఇతర ప్రభుత్వ శాఖలు, మీడియా సంస్థలకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేయబోతున్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను సన్మానించి, వారికి ఓటర్ ఐడీ కార్డు పంపిణీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.