Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరు అరెస్టయ్యారు.  హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది.

Updated : 07 Mar 2023 14:20 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో మరొకరు అరెస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని సోమవారం అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. రాత్రి 11 గంటల సమయంలో అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఈడీ అరెస్టు చేసింది.

రాబిన్‌ డిస్టిలరీస్‌ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్ర పిళ్లైని దిల్లీ మద్యం వ్యవహారంలో నిందితునిగా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన దిల్లీ ఈడీ అధికారులు పిళ్లెతో పాటు కలిసి వ్యాపారం నిర్వహిస్తున్న ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో రెండుసార్లు సోదాలు నిర్వహించారు. వీటిలో దొరికిన వివరాల ఆధారంగా ఇటీవల రెండు రోజులపాటు ఈడీ ప్రశ్నించింది. తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులతో ఆయనకు సంబంధాలున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈడీ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసులో రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇప్పటికే అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

మరోవైపు మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను తొలిసారి ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నించనున్నారు. సోమవారం సిసోదియాను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ప్రత్యేక కోర్టు పంపింది. తిహాడ్ జైలులో సిసోదియాను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని